Site icon NTV Telugu

కేసీఆర్‌కు రైతులను దూరం చేయాలని కేంద్రం కుట్ర: జగదీశ్‌రెడ్డి

తెలంగాణ లో యాసంగి వ‌రి ధాన్యం కొనుగోలు అంశం తెల్చకుండా రాష్ట్ర సీఎం కేసీఆర్ బీజేపీ నేత‌ల‌తో కేంద్ర మంత్రులు తిట్టిస్తున్నార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతుల‌ను దూరం చేయాల‌ని కేంద్ర మంత్రులు కుట్రలు ప‌న్నుతున్నార‌ని ఆగ్రహించారు. ఈ వాన కాలంలో తెలంగాణ లో 62 లక్షల ఎక‌రాల్లో వ‌రి పంట వ‌చ్చింద‌ని అన్నారు. కానీ తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం కేవ‌లం 60 లక్షల టన్నుల వ‌రి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని షరతు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

https://ntvtelugu.com/semi-christmas-celebrations-were-held-at-the-minority-office/

వాన కాలానికి సంబంధించిన మొత్తం వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు. అందు కోస‌మే తాము ఢిల్లీలో ప‌డిగాపులు కాస్తున్నామ‌ని తెలిపారు. అస‌లు తెలంగాణ నుంచి వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో అనే విష‌యం తేల్చకుండా రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర మంత్రులను తిట్టించడంసరికాదని విమర్శించారు. వ‌రి ధాన్యం విష‌యంలో బీజేపీ తో పోరాడాల్సిన కాంగ్రెస్ కూడా బీజేపీతో కలిసి నాటకాలు ఆడుతుందని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు.

Exit mobile version