ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి పైలాన్ ను కూడా ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు సురక్షిత నది జలాలు వచ్చాయని….ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారని..ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత అని కొనియాడారు. ఇంటింటికి సురక్షిత నది జలాలను అందిస్తున్నామని.. ఫ్లోరైడ్ మహమ్మారి ని తరిమేశామని తెలిపారు. ఫ్లోరైడ్ మాయమైందని కేంద్రమే చెప్పిందని పేర్కొన్నారు. 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డ్ సాధించిందని…ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. ప్రజల బాధలు పోయాయని..ప్రతిపక్షాలు ఏది పడితే అది మాట్లాడితే కుదరదని హెచ్చరించారు.
కోమటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్
