NTV Telugu Site icon

నమ్మకాల పార్టీ టీఆర్ఎస్- అబద్దాల పార్టీ బీజేపీ

హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారం మాటల యుద్ధంగా మారుతోంది. అధికార టీఆర్‌ఎస్ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. టీర్ఎస్ తో కొట్లాడే దమ్ము లేక కాంగ్రెస్ – బీజేపీ ఒక్కటయిందని, నమ్మకాల పార్టీ టీఆర్ఎస్ కు- అబద్దాల పార్టీ బీజేపీకి మధ్య పోటీ నెలకొందన్నారు. ఇది నడమంత్రపు ఎన్నిక. ఎవరు గెల్చినా రెండేళ్ల నాలుగు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కాదని ఎన్నిక జరుగుతుందా.. ఈటల రాజీనామా చేసింది రాజకీయ స్వార్థంతోనే అన్నారు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిండు. పెంచి పెద్ద చేసిన సీఎంను గుండెల మీద తన్నిండు. బీజేపీ ఎం చేసింది. ఏమైనా చక్కదనం ఉందా?

అందుకే అబద్దాల బీజేపీ, జూటా మాటల బీజేపీ. బట్టే బాజ్ బీజేపీ అని. నేను ఊర్కె అనలేదు. రాజేందర్ ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్ కాదా అన్నారు. 2004లో టికెట్ ఇచ్చిన నాడు ముద్దసాని దామోదర్ ముందు ఈయన ఎంతుంటే… ఈయన ముఖం తెలుసా? కేసీఆర్ ముఖం చూసి ఓటేసిండ్రు.. ఈయన ముఖం చూసి ఓటు వేసిండ్రా. అలాంటి కేసీఆర్ ను మోసం చేసి బీజేపీలో చేరిండ్రు. ఇప్పుడు మనల్ని మోసం చేయడా? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు.