NTV Telugu Site icon

కరోనా వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి : హరీశ్ రావు

Harish Rao

Harish Rao

దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. అవసరాల‌ తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. మూడో విడత‌ కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్స కు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు. కమిటీలోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.