Harish Rao: TSPSC పేపర్‌లీక్ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. అలా జరగకూడదని దురదృష్టకమని అన్నారు. పేపర్‌లీక్ అయితే ప్రతిపక్షాలు బయటపెట్టాయా..మా ప్రభుత్వమే గుర్తించిందని అన్నారు. నిందితులపై కేసులు పెట్టి బొక్కలో వేసిందని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే పరీక్షలు పెడుతామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు. ప్రతిపక్షాల వలలో పడి అభ్యర్థులు మీ సమయం వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. ప్రతిపక్షాలను నమ్ముకుంటే కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్టే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడుతాయి.. మట్టి పనికైనా ఇంటి పనికైనా మనోడు ఉండాలే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కి తెలంగాణపై ప్రేమ ఉంటది.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకి పెదవులపై ప్రేమ.. తెలంగాణుపై కపట ప్రేమ అన్నారు. కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాటు పడుతున్నాడని అన్నారు.
Read also: Sandra venkata verayya: వాళ్ల మాదిరి కులాల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేయడంలేదు
బీజేపోడు సమాధులు తవ్వుతా అంటాడు.. కాంగ్రెసోడు కూలగొడుతా అంటాడని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వారి నాలుకకు నరం లేదని అన్నారు. కాళేశ్వరం దండగ అన్నారు.. వాళ్లవి అన్ని గ్లోబెల్ ప్రచారాలు అని తెలిపారు.. కాళేశ్వరం దండగ కాదు పండుగ అని అన్నారు. కేసీఆర్ అనే అద్భుత దీపం రాదే రాదన్న తెలంగాణను తెచ్చిండని గుర్తు చేశారు. కానే కాదన్న కాళేశ్వరంని పూర్తి చేసి నీళ్లను అరకిలోమీటర్ పైకెత్తి నీళ్లను తెచ్చిండు పంట పండిందని తెలిపారు. ఢిల్లీలో కూర్చోని కాళేశ్వరం దండగ అంటున్నారు.. ఢిల్లీలో ఉన్నోనికి ఏం తెలుసు.. గల్లీలో ఉన్నోనికి కాళేశ్వరం గురించి తెలుసని హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి పెట్టిన పెట్టుబడి ఎప్పుడో తీరిపోయిందని అన్నారు మంత్రి. మహారాష్ట్ర నుంచి రైతులు మూడు బస్సులలో తెలంగాణ అభివృద్దిని చూడటానికి వచ్చారని అన్నారు. దేశంలోని రైతులందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు.. మాకు కేసీఆర్ నాయకత్వం కావాలంటున్నారని తెలిపారు. మనం రైతుల కోసం ఆలోచిస్తున్నాం.. మోడీ అదానీ కోసం ఆలోచిస్తుందని ఎద్దేవ చేశారు.
Read also: ఎండాకాలంలో జుట్టు హెల్తీగా ఉండాలంటే ఇలా చేయండి
వడ్లు కొనమంటే కొనమని బీజేపీ చెప్పింది… అదానీకెమో 12 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తారు గానీ.. 4 వేల కోట్లు పెట్టి వడ్లు కొనడం చేతకాదా? అంటూ ప్రశ్నించారు. రైతు బిడ్డగా రేతు చేయి కింద పడొద్దని కేసీఆర్ అనుకుంటున్నారని తెలిపారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం సచివాలయం దగ్గర పెడుతున్నామని తెలిపారు. సచివాలయానికి ఓ వైపు అమరుల త్యాగస్థూపం.. మరో వైపు అంబేడ్కర్ విగ్రహం అని స్పష్టం చేశారు. నెలకు 1500 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నది సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. జాతీయ స్థాయి అవార్డులు సాధించిన ఘనత సిద్దిపేట జిల్లాది అన్నారు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లు పాలించిన ఎవరికి ఏం చేయలేదన్నారు. ఈ నెల 16 నుంచి గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ అందజేస్తాం.. రెండు సార్లు ఈ కిట్ ఇస్తామన్నారు. మెనిఫెస్టోలో లేని పథకాలు కూడా ఇస్తున్నాం.. ఓట్ల కోసం ఇదంతా చేయట్లేదని తెలిపారు. సద్ది తిన్న రేవు తలవాలన్నారు. గతంలో లాగా రైతుల ఆత్మహత్యలు లేవు.. గంజి కేంద్రాలు లేవు అన్ని మాయమైపోయాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Balineni Srinivas Reddy: మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై బాలినేని క్లారిటీ!