Site icon NTV Telugu

Harish Rao: నూతన దంపతులకు వినూత్నంగా శుభాకాంక్షలు.. వైరల్‌..

Marriage

Marriage

నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు చాలా మంది ప్రజాప్రతినిధులు.. అందులో మంత్రి హరీష్‌రావు ఇంకా ప్రత్యేకమనే చెప్పాలి.. తన నియోజకవర్గంలోనే కాదు.. ఇతర నియోజకవర్గాల్లోనూ పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు హాజరైన శుభాకాంక్షలు చెబుతుంటారు. అయితే, బిజీగా ఉండడంతో.. ఓ పెళ్లికి హాజరు కాలేకపోయారు మంత్రి హరీష్‌రావు.. దీంతో.. నూతన వధూవరులను వినూత్నంగా ఆశీర్వదించారాయన.

Read Also: Krishna Janmabhoomi-Shahi Eidgah: మథుర షాహీ ఈద్గా కేసులో జులై 20న విచారణ

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటలోని మంత్రి హరీష్‌రావు దత్తత గ్రామం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన శ్రీలత, నరేందర్‌కు ఈ రోజు వివాహం జరిగింది.. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఈ వివాహానికి హాజరుకాలేకపోయారు మంత్రి హరీష్‌రావు.. ఎంతైనా తన దత్తత గ్రామం కావడంతో.. వీడియో కాల్ చేసి కొత్త దంపతులను ఆశీర్వదించారు హరీష్‌రావు.. ఆయన వీడియో కాల్‌ చేసి శుభాకంక్షలు తెలియజేయడంతో.. ఆ జంట మురిసిపోయింది. మొత్తంగా హరీష్‌రావు వీడియో కాల్‌లో శుభాకాంక్షలు.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి.

Exit mobile version