Site icon NTV Telugu

Harish Rao: రెండు రోజుల నుండి చూస్తున్న.. వాళ్ళు ఈరోజు వచ్చి నాటకాలా?

Harish Rao

Harish Rao

ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఇబ్రహీం పట్టణంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని తెలిపారు. వెంటనే మా అధికారులు స్పందించారు. 30 మందిలో కొంత మంది ను నిమ్స్, అపోలో ఆస్పత్రికి తరలించామన్నారు. ఇప్పుడు అందరూ సేఫ్ గా ఉన్నారన్నారు. నిమ్స్ లో 17 మంది ఉన్నారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో 13 మంది ఉన్నారన్నారు. రెండు మూడు రోజులలో అందరిని డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు.

5, 6 ఏళ్లలో 12 లక్షల అపరేషన్ లు చేసామని తెలిపారు. కానీ ఎప్పుడు ఇలా జరగలేదని హరీష్‌ తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యం వలన జరిగింది అనీ అతని లైసెన్స్ కేన్సిల్ చేశామన్నారు. ఒక కమిటీ వేశారు. రిపోర్ట్ రాగానే అందరి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇళ్ళలో ఉన్న వారిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకోని వచ్చి చికిత్స అందిస్తున్నారు. రాజకీయంగా నేను మాట్లాడనని, కర్ణాటక, బీజేపి, కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయి మాకు తెలుసన్నారు.

నేను రెండు రోజుల నుండి చూస్తున్నని, వాళ్ళు ఈరోజు వచ్చి నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని హరీష్‌ రావ్‌ అన్నారు. మా ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడే ఉంటున్నారని, వారిని గంట గంటకు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. బాధితులకు 5లక్షల ఎక్స్గ్రెషియా అందజేస్తామని, డబుల్ బెడ్ రూం పక్కాగా ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.
Kishan Reddy: త్వరలోనే శ్రీశైలానికి అమిత్ షా.. దర్శనానికి రైల్వే మంత్రిని కూడా తీసుకొస్తా

Exit mobile version