NTV Telugu Site icon

Minister Harish Rao: సొంత ఇంటి స్థలం ఉంటే.. రూ.3 లక్షలు మంజూరు చేస్తాం

Minister Harish Rao

Minister Harish Rao

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. నేడు (బుధవారం) సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఫుట్ పాత్ నిర్మాణం,14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని పేర్కొన్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామనిఅన్నారు. ఇంటింటా నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్తలో పొడి చెత్త రీ సైక్లింగ్ చేస్తున్నామని, నిత్యం 10 నుంచి 15 టన్నుల తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే.. 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలతో సేంద్రియ జీవ ఎరువు తయారు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈనేపథ్యంలో.. ఇప్పటి వరకూ 2,522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ సీఎన్జీ గ్యాస్ తయారైందని, అలాగే 579 టన్నుల తడిచెత్తతో సేంద్రియ జీవ ఎరువు తయారైందని మంత్రి చెప్పారు. దీంతో బుస్సాపూర్ డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగిపోయాయన్నారు. అంతేకాకుండా.. సిద్దిపేటలో అన్ని రకాల వైద్యం ప్రజలకు అందుబాటులో ఉన్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే.. సొంత ఇంటి స్థలం వున్నట్లైతే.. రాబోయే రోజుల్లో 3 లక్షలు రూపాయలు మంజూరు చేస్తామని శుభవార్త చెప్పారు. అంతేకాకుండా.. కొత్త రేషన్ కార్డులు, 57 ఏళ్లు దాటినా వృద్ధులకు ఫించన్లు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.

Sri lanka New President: లంకాధిపతిగా రణిల్ విక్రమసింఘే.. త్రిముఖ పోరులో విజయం

Show comments