Minister Harish rao: గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి, కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయిందని తెలిపారు. పని చేయరు… చేసే వారిని విమర్శిస్తారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని. కేంద్రం ఇచ్చింది ఒక్క మెడికల్ కాలేజీ అదికూడా అతిగతిలేకుండా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమాక్ పని చేయడం లేదని విమర్శించారు. వైద్యరంగంలో ప్రొఫెసర్ ల వయస్సు, విసిల బిల్లులు గవర్నర్ పెండింగ్ లో పెట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఓరుగల్లులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. పాధర్ కొలంబొ మెడికల్ కాలేజీతో పాటు హన్మకొండ ప్రసూతి ఆసుపత్రిలో రెడియాలజీ ల్యాబ్, కెఎంసిలో అకాడమిక్ బ్లాక్ ను ప్రారంభించారు. 1100 కోట్లతో 24 అంతస్థులతో 2100 పడకలతో నిర్మించే హెల్త్ సిటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి పనుల ప్రగతిని పర్యవేక్షించారు.
68 శాతం పనులు పూరైనా హెల్త్ సిటి పనులు వెయ్యి మంది కార్మికులతో ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి చేసి జనవరిలో గా అందుబాటులోకి తీసుకొస్తామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారని, దసరా వరకు 10 ఫ్లోర్ లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని చూస్తున్నామని చెప్పారు. 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. వచ్చే సంవత్సరం ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో ఉన్న ములుగులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం దేశంలో ఎక్కడ లేదన్నారు. 70శాతం డెలివరీ లు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయని, కాంగ్రెస్ పాలన తీసుకువస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సూది మందులు ఉండవు గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి, కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయిందని తెలిపారు. పని చేయరు చేసే వారిని విమర్శిస్తారని ఆరోపించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వడి కానీ విమర్శించడం సమంజసం కాదన్నారు.
DRDO Director : డీఆర్‌డీవో ఎంఎస్‌ఎస్ డీజీగా రాజబాబు