Site icon NTV Telugu

Harish Rao: సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించాం

Harish Rao

Harish Rao

సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించామని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల బహిరంగ సభలో ఆయన మట్లాడారు. ఈ మధ్య కొన్ని శక్తులు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయని అన్నారు. మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారికి అధికారం పోతే అభివృద్ధి కుంటు పడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా మాట్లాడే కొంతమంది నాయకులను చూస్తే జాలి వేస్తుందని ఎద్దేవ చేశారు. కొన్ని శక్తులు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అటువంటి దుష్ట శక్తుల పట్ల, సమాజాన్ని దేశాన్ని ఆగం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కులం ఏదైనా, మతం ఏదైనా పేదల కోసం పని చేయాలన్నది కేసీఆర్ మాట అని గుర్తు చేశారు.

Read also: Aa Ammayi Gurinchi Meeku Cheppali Review : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి! రివ్యూ

పేదలకు పని చేయడానికి కులాలు, మతాలు అడ్డు రావద్దని హరీష్‌ రావ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో మనం వివక్షకు గురయ్యామన్నారు. తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడ్డ సిద్దిపేట ఇప్పుడు కాళేశ్వరంతో రంగనాయక సాగర్ తో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. కొందరిని చూస్తే జాలి వేస్తుందని మంత్రి హరీశ్‌ రావ్‌ అన్నారు. ఢిల్లీ, హైదరాబాద్ ల నుంచి కొంతమంది టీవీలలో మాట్లాడుతారని అన్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం పారిందా అంటారు? వాళ్ళని చూస్తే నవ్వాలో, ఎడవాలో అర్థం కావడం లేదని అన్నారు. ఓ సారి సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్, దుబ్బాక కు వస్తే తెలుస్తుందని హరీశ్‌ రావ్‌ అన్నారు. అట్లా మాట్లాడేటోళ్లు ఇటు వస్తే నోటి శుద్ధి, దేహ శుద్ధి చేసి పంపిస్తామన్నారు. కాళేశ్వరం పారేది నిజం, పంట పండేది నిజమని హరీశ్‌ రావ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో.. మంత్రి హరీష్ రావు , కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత పాల్గొన్నారు.
Aa Ammayi Gurinchi Meeku Cheppali Review : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి! రివ్యూ

Exit mobile version