తెలంగాణలో దళితుల సమగ్ర ప్రగతికి సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్గిపేట జిల్లానారాయణ రావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో దళిత బంధు అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు పాల్గొన్నారు.
దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు హరీష్ రావు. దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలతో స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి మీ కాళ్లపై మీరు నిలబడాలన్నారు. అధికారులు బంజరుపల్లి గ్రామంలో ఇంటింటికీ వచ్చి సర్వే నిర్వహించి , 21 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం వర్తించనున్నదని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని బీజేపీ పాలిత, ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా దళిత కుటుంబం పెళ్లికి తొలుత 50 వేల రూపాయలతో కల్యాణ లక్ష్మీ పథకం ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద 10 లక్షల ఆడ బిడ్డల పెళ్లిళ్ళకు ఒక్కొక్కరికీ లక్ష 116 చొప్పున అందించినట్లు తెలిపారు.