తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదని, మెడికల్ కాలేజీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా 65 ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే, 7 ఏళ్లలో వాటిని 33కు పెంచుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు రండి. నాణ్యమైన ఉచిత సేవలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. టీఆర్ఎస్ ప్రకృతి పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వికృతి పార్టీలంటూ ఆయన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు పన్నతున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేప పార్టీ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకుంటుందని ఆయన ఆరోపించారు.