సిద్ధిపేటలో మంత్రి హరిష్ రావు తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ర్టంలో తొలిసారి ఈ తరహా ప్లాంట్‌ను సిద్ధిపేటలోనే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడిచెత్త నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. తడిచెత్తలో వచ్చే సూదులు, శానిటరీ ప్యాడ్లు, ఔషధ వ్యర్థాల దహనానికి ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
స్థానికంగా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. సిద్ధిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఎలాంటి కాలుష్య హాని ఉండదని మంత్రి వెల్లడించారు. స్థానికంగా ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల యువతకు ఉపాధి లభించడంతో పాటు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు అంశంపై మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకుండా తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడుతుందన్నారు. రైతులు బీజేపీ నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి వివరించారు.
