Harish Rao: రాష్ట్రంలో పనీ చేస్తున్న 27 వేల మంది ఆశలకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఈనెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. ఆశ వర్కర్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలన్నారు. వ్యాధితో బాధపడుతున్న వారు వైద్యుడు, సిబ్బందిని దేవుడిగా భావిస్తారన్నారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. పిల్లలకు 100% వ్యాక్సిన్ వేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు సాధించామని తెలిపారు. వైద్య ఆరోగ్యంలో 14వ స్థానం నుంచి రాష్ట్రం ఏర్పడిన తరువాత 3వ స్థానంలోకి వచ్చామన్నారు. తెలంగాణకు ముందు ప్రైవేట్ లో 70%, 30% ప్రభుత్వ ఆసుపత్రులో డెలివరీలు ఉండేవని ఇప్పుడు ప్రభుత్వంలో 70% డెలివరీలు జరుగుతున్నాయని అన్నారు. న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భంతో ఉన్న మహిళలకు బలవర్ధక ఆహారం అందిస్తోందని తెలిపారు. మనది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే కొందరివి పార్టీషన్ పాలిటిక్స్ అన్నారు.
కుల మతాల చిచ్చుపెట్టె పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు ఆశాలు చెప్పాలన్నారు. టి డియాగ్నోస్టిక్స్ ద్వారా ప్రజలకు ఉచిత చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఒక్కో ఆశ వర్కర్ పై 50వేలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చి దిద్దుతామన్నారు. రాష్ట్రంలో పనీ చేస్తున్న 27 వేల మంది ఆశలకు శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. దేశంలో అత్యధిక వేతనం ఆషాలకు తెలంగాణలోనే ఇస్తున్నామన్నారు. నాలుకకు నరం లేదని ప్రతిపక్షంలోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని మండిపడ్డారు. ఆశాలకి గతంలో వేతనం పెంచమనీ అడిగితే గుర్రాలతో తొక్కించారన్నారు. అర్ధరాత్రి ఆశా వర్కర్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషల్ లో ఉంచిన చరిత్ర కాంగ్రెస్ ది అని మంత్రి హరీష్ రావు అన్నారు. 4500 జీతం మాత్రమే ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్ లో ఆశాలకు వేతనం ఇస్తున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ ఏ.ఎన్.ఎం.లను కావాలనే రెచ్చగొడుతున్నారని తెలిపారు. సెకండ్ ఏఎన్ ఎంలకు రాష్ట్రంలో 27000 లకు పైగా వేతనం ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత వేతనం లేదన్నారు. ఏ ఎన్ ఎంల రిక్రూట్మెంట్ లో మీకే మొదట ప్రధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం బస్తి ప్రజల సుస్థి గురించి ఆలోచించలేదని, బస్తి దవాఖాన సూపర్ హిట్ అయిందని అన్నారు. బస్తి దవాఖాన ల వల్ల ఉస్మానియాలో 60% ఒపి భారం తగ్గిందని తెలిపారు. గాంధీకి 56% ఒపి తగ్గింది, ఫీవర్ ఆసుపత్రిలో 72% ఒపి భారం తగ్గిందన్నారు. గర్భిణుల కోసం 3 కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గాంధీలో ఒక వారంలో సూపర్ స్పెషలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో మతా మరణాలను 42 కి తగ్గించామన్నారు మంత్రి హరీష్ రావు. నాలుగు టైమ్స్ ఆసుపత్రులు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. కోర్ట్ కేస్ పూర్తి అవ్వగానే ఉస్మానియాకి అధునాతన భవనం అందుబాటులోకి రానుందని తెలిపారు. నిమ్స్ లో రోబోటిక్ యంత్రం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. నిమ్స్ వైద్యుల సేవలు అభినందనీయమన్నారు.
PM Modi: “మోడీ భయపడేవాడు కాదు”.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని..
