Site icon NTV Telugu

Minister Harish Rao: మిషన్ భగీరథకు అవార్డుతో కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలి

Harish Rao

Harish Rao

Minister Harish Rao: మిషన్ భగీరథకు అవార్డుతో అయినా కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలని మంత్రి హరీష్‌ రావ్‌ మండిపడ్డారు. రెండు రోజులకు ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు తెలంగాణ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దవచేశారు. తెలంగాణ రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తుంది.. దానిపై మాకు సంతోషంగా వుందని అన్నారు. ఒకరు పాదయాత్ర, మరొకరు మోకాళ్ల యాత్ర చేస్తున్నారని ఎద్దేవ చేశారు మంత్రి. ఎవరైనా ప్రజలు నీటి సమస్యను తీసుకువచ్చారా ? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కు 20,30 అవార్డులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.

దేశానికి తెలంగాణ మాడల్ అయ్యిందని తెలిపారు. కేంద్రం ఢిల్లీలో అవార్డులు ఇస్తుందని, కేంద్ర మంత్రులు గల్లీలో అవాక్కులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథకు 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది, కానీ 19 పైసలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం మిషన్ భగీరథ నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వాలని కేంద్రంకు సిపారసు చేసిందని అన్నారు. కానీ కేంద్రం 15 వ ఆర్థిక సంఘం సిఫారసులను పక్కన బెట్టిందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణ కు నిధులు ఎందుకు ఇవ్వదు ?అని ప్రశ్నించారు.
SAIL Entered Trillion Club: లక్ష కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన కంపెనీల క్లబ్‌లోకి తొలిసారిగా ‘సెయిల్‌’

Exit mobile version