Site icon NTV Telugu

జై కిసాన్‌ నినాదాన్ని.. నై కిసాన్‌ గా మార్చారు : హరీష్‌రావు

ధాన్యం కొనుగోలుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ నేతలు నిర్వహించిన ధర్నాలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు.

అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమిస్తే.. ఇప్పుడు రైతుల కోసం ఉద్యమించాల్సి వస్తోందన్నారు. జై కిసాన్‌ నినాదాన్ని.. నై కిసాన్‌ గా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. రా రైస్‌ అంటూ బీజేపీ నేతలు తేలివిగా మాట్లాడుతున్నారని.. పంజాబ్‌లో రైతులకో న్యాయం.. తెలంగాణ రైతులకో న్యాయమా..? అంటూ ప్రశ్నించారు. రైతులను ఉగ్రవాదులతో పొల్చడం శోచనీయమన్నారు.

Exit mobile version