Site icon NTV Telugu

Harish Rao: పేరు గొప్ప ఊరు దిబ్బ.. గవర్నర్ వ్యాఖ్యలపై కౌంటర్స్

Harish Rao Tamilisai

Harish Rao Tamilisai

Minister Harish Rao Counter To Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఒక డాక్టర్ అయ్యుండి, వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె మాట్లాడం బాధాకరమన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే.. మీరు విమర్శిస్తున్నారు’ అంటూ గవర్నర్‌పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఎయిమ్స్ బీబీ నగర్ ఆసుపత్రిలో కనీస వసతులు కూడా లేవని.. దాన్ని ఒకసారి సందర్శించి, ఆ తర్వాత తమ వైద్యారోగ్య వ్యవస్థపై మాట్లాడండి అని హరీష్ రావు సూచించారు.

తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో.. 10 పైసలు కూడా ఎయిమ్స్‌లో లేవని ఎద్దేవా చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైందని విమర్శించారు. ఆ ఎయిమ్స్‌లో లేరు, డెలివరీలు కావు, కనీస సౌకర్యాలే ఉండవని పేర్కొన్నారు. డాక్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా గవర్నర్ తమిళిసై మాట్లాడటం, నిజంగా బాధాకరమని మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఓ ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరుతున్నారని గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు పై విధంగా స్పందించారు. తమిళిసై వ్యాఖ్యలను అధికార నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తప్పుపట్టారు.

Exit mobile version