NTV Telugu Site icon

Harish Rao: దానికోసం.. ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయం

Harish Rao

Harish Rao

Harish Rao: పేద ప్రజల కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్‌ రావ్‌ అన్నారు. నిమ్స్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎం.సి.హెచ్ ఆసుపత్రికి ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ కోసం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ఎం.సి.హెచ్ ల మీద 490 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మాతా శిశు మరణాలు తగ్గి దేశంలోనే 3 వ స్థానంలో నిలిచామన్నారు. మొదటి స్థానం వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. గర్భిణీ స్త్రీ ఇతర సమస్యలతో బాధపడతారని, రిఫర్ చేస్తే, మార్గ మధ్యలో మరణించడం జరుగుతుందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చెంతకు ఎం.సి.హెచ్ తెస్తున్నామని హరీశ్‌ రావ్ అన్నారు.

Read also: Minister Ktr: ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది

గాంధీలో, అల్వాల్ లో , నిమ్స్ లో మొత్తం 600 పడకల ఎం సి హెచ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అని తెలిపారు. అధునాతన సౌకర్యాలు మరో 2000 పడకలు నిమ్స్ లో వస్తాయన్నారు. పేద ప్రజల కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయమన్నారు. వంద పడకల డయాలసిస్ సెంటర్ ప్రారంభించు కాబోతున్నామని హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మనకు డయాలసిస్ బెడ్స్ 34 ఉంటే నిమ్స్ లో 100 కు పెంచుకుంటున్నామని తెలిపారు. రోజుకు 1500 పేషెంట్లకు సేవలు అందుతాయని, 2000 పడకల నిమ్స్ కొత్త బిల్డింగ్ కు త్వరలో సీఎం శంఖు స్థాపన చేస్తారని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.
KTR: నేను ఇంటర్ చదివింది గుంటూరులోనే కానీ.. వాటిగురించి మాట్లాడను

Show comments