Site icon NTV Telugu

కరోనా టైంలో మీ సేవలు అపూర్వం.. వైద్య సిబ్బందికి హరీష్ అభినందనలు

కరోనా ముంచుకు వస్తోంది. దేశవ్యాప్తంగా రోజూ లక్షలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ కేసుల తీవ్రత కొనసాగుతోంది. అయితే, వీరికి నిరంతరం సేవలందిస్తూ వారి రికవరీకి ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు వైద్యారోగ్య సిబ్బంది. ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలో అద్భుత మైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ట్విట్టర్ లో అభినందించారు మంత్రి హరీశ్ రావు.

https://ntvtelugu.com/harish-rao-said-that-56-thousand-new-corona-beds-have-been-set-up-in-telangana/

కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన గర్బిణికి‌ కరోనా సోకినా,నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం చేయడంతో పాటు,జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రిలో కరోనా సోకి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గర్బిణికి సురక్షితంగా డెలివరీ చేసారు. క్లిష్ట పరిస్థితులలో వెలకట్టలేని సేవలందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు అని ప్రశంసించారు హరీష్ రావు.

https://twitter.com/trsharish/status/1485220411201957895
Exit mobile version