Site icon NTV Telugu

Harish Rao: సివిల్స్ విజేతలకు విందు

Harishrao

Harishrao

హైదరాబాద్‌లోని తన నివాసంలో సివిల్స్‌ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌, మెంటార్‌ మల్లవరపు బాలలత నేతృత్వంలో సివిల్స్‌ ర్యాంకర్లు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు.

సివిల్స్‌లో ర్యాంకులు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత.. హైదరాబాద్‌లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడమీని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికిపైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమన్నారు.

సీఎస్‌బీ అకాడమీ నుంచి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. సివిల్స్ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి బాలలత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎస్‌బీ అకాడమీ ద్వారా మరింత మంది సివిల్స్ విజేతలను దేశానికి అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలుగు వారు పెద్ద సంఖ్యలో సివిల్స్ విజేతలుగా నిలిచారని అన్నారు.

మంత్రిని కలిసిన వారిలో సుధీర్‌కుమార్‌రెడ్డి (ర్యాంక్‌-69), అరుగుల స్నేహ (136), బీ చైతన్య రెడ్డి (161), రంజిత్‌కుమార్‌ (574), స్మరణ్‌రాజ్‌ (676)తో పాటు ఎన్ఆర్ఐ మల్లవరపు సరిత ఉన్నారు.

Somu Veerraju: ఓట్ల కోసమే కోనసీమలో అలజడి

Exit mobile version