Minister Harish Rao and MLA Jaggareddy on the same stage: సంగారెడ్డి కలెక్టరేట్ లో కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అయితే ఒకే వేదికపై మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రత్యక్షమవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్‌ఎస్, టీ.కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు, మాటల తూటాలు పేల్చే నాయకులు ఇలా ఒకే వేదికపై ప్రత్యక్షమైతే ఆ కిక్కే వేరబ్బా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ పరస్పర విమర్శలు చేసుకునే నాయకులు పక్కపక్కనే కూర్చోగా.. అక్కడి వారు ఈ ఫొటోను తమ చరవాణిలో బంధించుకున్నారు. బీఆర్‌ఎస్ కంటి వెలుగు కార్యక్రమంలో టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేతులు కట్టుకుని మంత్రి హరీశ్ రావ్ మాట్లాడుతుంటే వింటూ కూర్చోడం ఆశ్చర్యాన్ని కలుగ జేసినా.. బీఆర్‌ఎస్ కార్యకర్తల నడుమ టీ.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూర్చొని ఉండటం జనం ఆశ్చర్యంగా చూశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే కార్యకర్తలు ఇలా కలిసి ఒకే వేదిక పంచుకోవడం ఏంటని ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదైతేనేం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో.. టీ.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఒకే వేదిక పంచుకోవడంతో పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
Read also: Axar Patel: చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. టీమిండియా తొలి ఆటగాడిగా..!!
సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రైతుల కోసం కల్లా లు నిర్మిస్తే 150 కోట్లు కేంద్రం తీసుకుందని అన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టలేదని కేంద్రం 12వేల కోట్లు అపిందని అన్నారు. 15 వేల కోట్ల కోసం FRBM తీర్మానం చేసిన కేంద్రం ఇవ్వలేదన్నారు. 15 వ ఆర్ధిక సంఘం నుండి వచ్చే 5300 కోట్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రనికి 40 వేల కోట్లు కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలొనే సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ హాస్పిటల్ లో 86 శాతం డెలివరీలు అవుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. DSP రవీంద్రా రెడ్డి తో వాగ్వాదం