Site icon NTV Telugu

Harish Rao : రక్తదానం విషయంలో అపోహలు వద్దు

Harish Rao Blood

Harish Rao Blood

ప్రజల్లో చైతన్యం పెంచడానికి వరల్డ్ డోనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదాన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉన్నారన్న మంత్రి హరీష్‌ రావు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 18 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. 1000 యూనిట్స్ తక్కువ కాకుండా అందించారని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో యూనిట్స్ బ్లడ్ అందించారన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి 7100 యూనిట్స్ రక్తాన్ని అందించారని, ఆపదలో ఉన్న వారికి రక్తం అందిస్తున్న ఎమ్మెల్యేలను సన్మానిస్తున్నామని మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు.

రక్తదానం విషయంలో అపోహలు వద్దని, రక్తదానం చేస్తే ఒకరి ప్రాణం నిలబడుతుంది,అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. తెలంగాణ రాక ముందు 28 బ్లడ్ బ్యాంకులు ఉండేవి, 56 బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు దిశగా పని చేస్తున్నాం.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ సెపరేట్ మెషీన్స్ ని ఏర్పాటు చేయబోతున్నాం.. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్స్ కే ఎక్కువగా రక్తం అందించండి.. అని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

Exit mobile version