Site icon NTV Telugu

పేద బిడ్డలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువు కోవద్దా..? : మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం అంటే.. బీజేపీ నేతలకు ఎందుకు ఏడుపు వస్తుందోనని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌ నగర్‌ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడయంలో చదువుకోవద్దా.. కార్పొరేట్ బుద్ధిని బీజేపీ మరోసారి బయట పెట్టిందన్నారు. వారికి తలొగ్గి విమర్శలు చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు ఇస్తాం అంటే కోర్టుల్లో కేసులు వేస్తారు.. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందిస్తామంటే విమర్శలు చేస్తారు. దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్లో కట్టేయమన్నట్లుంది బీజేపీ, కాంగ్రెస్‌ తీరు అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: చేసిన పాపం అనుభవించాల్సిందే .. ఎంపీ అరవింద్‌పై ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తే… అది సాధ్యం కాదు.. అయితే టీఆర్‌ఎస్‌ తరుపున ప్రచారం చేస్తా అని నాటి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నాడని హరీష్‌ రావు పేర్కొన్నారు. అన్నమాట ప్రకారం ఉచిత కరెంట్ ఇచ్చాము. మిషన్ భగీరథ తో నీళ్లు ఇచ్చి చూపెట్టాం. రేపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం విద్యను ప్రారంభించి దేశానికే తెలంగాణ విద్యా విధానాన్ని ఆదర్శంగా నిలపబోతున్నామని మంత్రి హరీష్‌ రావు అన్నారు. కొల్లాపూర్‌కు వెంటనే డయాలసిస్ సెంటర్ మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం రంగంపై బాగా దృష్టి సారించారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు ఆస్పత్రులు, మూడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో వైద్యం చాలా బాగా అందుబాటులోకి వచ్చిందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,280 కోట్లు ఖర్చు చేయబోతుందన్నారు.

Exit mobile version