సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం 1లక్ష829 రూపాయలు మాత్రమే నమోదయిందని కానీ 2020-21 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 1లక్ష 24వేల 104 రూపాయాల తలసరి ఆదాయం, 2020-21 నాటికి 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని మంత్రి అన్నారు.
Read Also: నాలుగో రోజు 6లక్షలకు పైగా ఖాతాల్లో రైతుబంధు
పల్లెప్రగతి, వివిధ గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా పల్లెల రూపురేఖలు మారాయన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోనూ రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందన్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నాని డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లోఉన్నానని, మరికొన్ని రోజుల్లో ప్రజలను నేరుగా కలుస్తానని తెలిపారు. అనంతరం రాష్ర్ట ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
