Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు

Yerrabelli

Yerrabelli

విశ్వవిఖ్యాత నటుడిగా, పరిపాలకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా హనుమకొండలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని, రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇండ్లు ఇచ్చారన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచారని, ఆయన సేవలు చిరస్మరనీయమన్నారు. విశ్వవిఖ్యాత నటుడిగా, పరిపాలకుడిగా తెలుగుప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు.

అనంతరం ఆయన జనగామ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన పల్లెప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. ఈ సమావేశానిని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ సంపత్‌ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిథులు హాజరయ్యారు.

Congress : కొండా కుటుంబం నుంచి బరిలోకి దిగేది ఎవరు..?

Exit mobile version