NTV Telugu Site icon

Assembly Meeting: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. సీఎం మాట్లాడుతుండగా సభలో బీఆర్ఎస్ రచ్చ

Revantha Reddy

Revantha Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. గురువారం ఆరో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్టుగా సభ నడింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్దం నడిచింది. కాగా సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తాము ఎవరికి భయపడేది లేదని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా తమకు ఇబ్బంది లేదంటూ ధీటుగా సమాధానం ఇచ్చారు.

Also Read: New Covid Variant: కేసుల పెరుగుదలకు కారణమవుతున్న కొత్త కోవిడ్ వేరియంట్.. ఈ లక్షణాలపై అప్రమత్తంగా ఉండండి..

అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ‘అక్బరుద్దీన్ ఆరు సార్లు గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసుకున్నాం. సభలో సభ్యులందరికి ఒకే విధమైన హక్కులు ఉంటాయి. Brs.. mim మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఓల్డ్ సిటీ.. న్యూ సిటీ అనే తేడా మాకు లేదు. Mim నేత అక్బరుద్దీన్ ముస్లింలకు మాత్రమే నాయకుడా? హిందువులు ఆయనకు ఓట్లు వేయలేదా.

Also Read: Parliament security: భద్రతా ఉల్లంఘన నేపధ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంట్ సెక్యూరిటీ..

మేము జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కి టికెట్ ఇస్తే ఓడించే ప్రయత్నం చేసింది ఎంఐఎం. కామారెడ్డి లో షబ్బీర్ అలీని ఓడించడానికి అక్బర్ దోస్తు కేసీఆర్ కలిసి పని చేశారు. కవ్వం పల్లి లాంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకి తగదు’ అని అన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా ఎంఐఎం పార్టీ సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి గందరగోళం సృష్టించారు. అనంతరం బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సభలో రచ్చ రచ్చ చేశారు. అలా ఎంఐఎం సభ్యుల ఆందోళన మధ్య సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం సాగింది.

Show comments