NTV Telugu Site icon

Rajanna Sircilla: సిరిసిల్లలో దారుణం.. మహిళపై వలస కూలీల అత్యాచారం..హత్య..!

Rajanna Siricilla Crime News

Rajanna Siricilla Crime News

Rajanna Sircilla: కార్మిక శిబిరం సిరిసిల్లలో దారుణం చోటుచేసుకుంది. కూలి పనికి వెళ్లిన మహిళపై వలస కూలీలు దాడి చేశారు. మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత హత్య చేసి పారిపోయారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బిహార్‌కు చెందిన ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు సిరిసిల్ల అనంతనగర్‌లోని ఓ ఇంట్లో ఆరు నెలలుగా ఉంటున్నారు. 15 రోజుల క్రితం నలుగురు వ్యక్తులు బీహార్ వెళ్లారు. రాముబృక్ష సదా, రుడాల్ సదా నాలుగు రోజుల క్రితం ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చారు. ఆపై వారు అదృశ్యమయ్యారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని రామస్వామి పోలీసులకు సమాచారం అందించాడు.

Read also: Minister Karumuri Nageswara Rao: బీసీలకు ప్రాధాన్యత విషయంలో వైసీపీని ఏ పార్టీ దాటలేదు..

సీఐ రఘుపతి సంఘటనా స్థలానికి వెళ్లి ఇంటి తాళం పగులగొట్టి చూడగా రక్తపు మడుగులో మహిళ మృతదేహం కనిపించింది. ఆమె తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. గదిలో మద్యం సీసాలు ఉండడంతో కార్మికులు మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బీహారీ కార్మికులు మారడంతో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. హత్యకు గురైన మహిళ వేములవాడ మండలం కొడుముంజకు చెందిన ఆలకుంట రమ(41)గా పోలీసులు గుర్తించారు. రమ భర్త రాజయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. రమ రోజూ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూలి పనుల నిమిత్తం సిరిసిల్లకు వచ్చిన ఓ మహిళను బీహార్ నుంచి వలస కూలీలు ఈనెల 19న ఆమె గదికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ రఘుపతి తెలిపారు.
Tollywood – Remake: ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా.. ఇప్పటికి అదే రికార్డ్..!

Show comments