MGM Hospital: కోతుల చేష్టలు రోగులకు ఆవస్థలు తెచ్చిపెట్టాయి. శుక్రవారం అర్ధ రాత్రి సమయంలో హనుమకొండ ఎంజీఎం ఆసుపత్రిలోని అత్యవసర వైద్యవిభాగం వెనుకాల ఏఎంసీకి వెళ్లే దగ్గర కోతులు విద్యుత్తు స్తంభాల తీగలపై అటు ఇటు కదిలించాయి. దీంతో కరెంట్ తీగలు ఒకదానికి ఒకటి రాసుకొని మంటలు లేచి ట్రాన్స్ఫార్మర్ పేలి పోయింది. అందులోనుంచి మంటలు వచ్చి విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. దీంతో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఏఎంసీ, శిశువులు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ), ఆర్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో అంధకారంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర రోగులకు చికిత్స అందించడానికి వైద్యులకు సైతం అవస్థలు తప్పలేదు. నవజాతశిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న శిశు వులకు ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియక తల్లిదండ్రులు వార్డు బయట ఆందోళన చెందారు.
Read also: Sai Pallavi: బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్
ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు, నవజాతశిశు సంరక్షణ కేంద్రంలోని ఇంక్యుబేటర్లకు విద్యుత్తు సరఫరా లేనప్పుడు యంత్రపరికరాలు పనిచేసేలా బ్యాటరీ బ్యాకప్ ఉండాలి. అలాంటివి ఏవీ లేకపోవడంతో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆత్యవసర సమయంలో విద్యుత్తును అందించడానికి ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఉన్నా ఆవి పనిచేయడం లేదని సమాచారం. విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన విషయం తెలుసుకున్న ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశాలతో ఆర్ఎంవో డాక్టర్ మురళి, ఇతర వైద్యాధికారులు ఆసుపత్రికి చేరుకొని ఎన్పీడీసీఎల్ అధికారులను పిలిపించి మరమ్మ తులు చేపట్టారు. మరోవైపు రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
TS 6 Guarantees: ప్రజాపాలనకు పోటెత్తిన దరఖాస్తులు.. రెండోరోజుల్లో 8.12 లక్షలు