హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బిర్యానీ ఫైటింగ్ వ్యవహారం హోం మంత్రి మహమూద్ అలీ వరకు వెళ్లింది… హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. ఇక, ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచి ఉండే సందర్భాలు ఉంటాయి… మరికొన్ని రాత్రి 11 గంటలకే మూత పడుతున్నాయి.. ఇంకా కొన్ని హోటల్స్ చాటుమాటుగా.. అర్ధరాత్రి వరకు బిర్యానీ, ఇతర విక్రయాలు కొనసాగిస్తూనే ఉంటాయి.. అయితే, అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ వెళ్లింది.. ఈ టైంమ్‌లో ఫోన్ వచ్చిందంటే.. ఏదైనా అత్యవసరం ఏమో అన్నట్టుగా.. ఫోన్ తీశారట హోంమంత్రి… అయితే, తీరా చూస్తే.. పాత బస్తీలో ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచిఉంచాలో చెప్పాలని అవతలి వ్యక్తి అడగడంతో అసహనం వ్యక్తం చేశారు మహమూద్ అలీ..
Read Also: PVN Madhav: బీజేపీతో టీడీపీ, వైసీపీ మైండ్ గేమ్..!
ఫోన్ చేసిన వ్యక్తిని కాస్త గట్టిగానే మహమూద్ అలీ మందలించినట్టు తెలుస్తోంది.. నేను హోంమంత్రిని.. వంద టెన్షన్లు ఉంటాయన్న ఆయన.. అర్ధరాత్రి ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.. కాస్త టైం తీసుకుని.. రాత్రి 11 గంటలకే హోటల్స్ మూసేస్తారని తెలిపారు మహమూద్ అలీ.. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం.. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిశారు ఎంఐఎం నేతలు.. అంతేకాదు, అర్ధరాత్రి విక్రయాలకు అనుమతి ఉందని కూడా ఎంఐఎం నేతలు చెబుతున్నమాట.. మొత్తంగా ఓల్డ్ సిటీలో బిర్యానీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది…
