టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు జేఎన్‌టీయు కు చెందిన ముగ్గురు విద్యార్ధులు ఎంపికయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ముగ్గురు విద్యార్ధులను మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంపిక చేసుకుంది. సాయి అస్రిత్ రెడ్డి, స్పూర్తిరాజ్, మహ్మద్ మూర్తుజాలు ఎంపికైనట్టు ఆ టెక్ దిగ్గజ సంస్థ తెలియజేసింది. సంవత్సరానికి రూ.41 లక్షల వేతనంతో వీరిని ఎంపిక చేసుకున్నది. జేఎన్‌టీయు నుంచి మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైన వారిలో వీరిదే అత్యధిక వేతనం కావడం విషేషం. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల ఎంపికయ్యాక ఆ సంస్థలో భారతీయులకు ప్రాముఖ్యత పెరుగుతూ వస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ సంస్థలు భారతీయులకు పెద్దపీట వేస్తున్నాయి.
Read: చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా…?