NTV Telugu Site icon

Telangana Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్

Talangana Rain

Talangana Rain

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వారం చివరి వరకు వర్షాలు కురుస్తాయని అంచనా. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మే 4 నుంచి 7వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్ వాతావరణ కేంద్రం రేపటి నుంచి 7వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, బలమైన గాలుల దృష్ట్యా, సురక్షిత ప్రదేశాలలో ఉండండాలని సూచించారు.

హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్నిసార్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సాధారణంగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయని, ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.

మంగళవారం మెదక్ జిల్లాలో 23.6 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 25.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 2.6, హైదరాబాద్‌లో 2.5, దుండిగల్‌లో 2.2, హకీంపేటలో 11.8, భద్రాచలంలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలకు సంబంధించి మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 32.7 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్పంగా మెదక్‌లో 17.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చాలా ప్రాంతాల్లో అత్యధికంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 2న ఆదిలాబాద్‌లో గరిష్టంగా 31.8 డిగ్రీలు, కనిష్టంగా 23.7, భద్రాచలం గరిష్టంగా 30.6, కనిష్టంగా 23.5, హకీంపేటలో గరిష్టంగా 28.8, కనిష్టంగా 22.0, దుండిగల్‌లో 30.2, కనిష్టంగా 22.9, హనుమకొండలో గరిష్టంగా 29.5, కనిష్టంగా 20.6, హైదరాబాద్‌లో 29.5, కనిష్టంగా 2011.0, హైదరాబాద్‌లో 3. మ్మా , మహబూబ్‌నగర్‌లో కనిష్టంగా 23.0 డిగ్రీలు, గరిష్టంగా 32.7 డిగ్రీలు, కనిష్టంగా 22.1 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Viral: పోతావ్ రా అరేయ్.. కాలు జారితే కాటికే..

Show comments