మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూడూరు గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని నిలదీసేందుకు వెళ్లిన తనపై కర్రలు,పైపులతో విచక్షణ రహితంగా నరేందర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారని బాధితురాలు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు బుధవారం మేడ్చల్ పోలీసులు ఐపిసి సెక్షన్లు 324,342,506,509, కింద కేసు నమోదు చేశారు. పూడూరు గ్రామ వార్డు మెంబర్ భర్త నగేష్,నరేందర్ రెడ్డి బంధువులు మహిళను దారుణంగా కొట్టారు.
న్యాయం చేయాల్సిన వార్డు మెంబర్ భర్త నగేష్ ఓ మహిళ అని గౌరవించకుండా మహిళను కిందేసి తొక్కడం పుడురు గ్రామంలో చర్చనీయంశంగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు మేడ్చల్ పోలీసులను సంప్రదించింది.ఒక మహిళ అని చూడకుండా నరేందర్ రెడ్డి ఇంట్లోని మహిళలు సైతం మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులపై కేసు నమోదు అయినా వారిని అరెస్టు చేయకపోవాడానికి కారణాలేంటని, బీఆర్‌ఎస్ పార్టీ వార్డు మెంబర్ భర్తను అరెస్టు చేయకుండా పోలీసు కాలయాపన ఎందుకు చేస్తున్నారని చర్చ సాగుతోంది.