తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.. ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.. ఇక, వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. “నా ప్రియమైన స్నేహితుడు మరియు ఐటీ అండ్ కమ్యూనికేషన్ మంత్రి కేటీఆర్ మరియు అతని భార్యను హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు.. కాన్రాడ్ సంగ్మా ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్ “సంగ్మాకాన్రాడ్ గారిని కలవడం ఆనందంగా ఉందంటూ రీట్వీట్ చేశారు..
Telangana: కేటీఆర్‌తో మేఘాలయ సీఎం భేటీ..

Cm Conrad Sangma