Site icon NTV Telugu

Meenakshi Natarajan : మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసమే పనిచేస్తుంది

Meenakshi Natarajan

Meenakshi Natarajan

Meenakshi Natarajan : ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకే సేవలు చేస్తోందని కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పని చేస్తోంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం రెండు రకాల పాలన మోడల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి తెలంగాణ మోడల్ కాగా, రెండవది విద్వేష పూరిత పాలన మోడల్. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయానికి దోహదపడుతున్నాయని, ఇవి రాహుల్ గాంధీ మోడల్‌కు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.

Bhagavanth Kesari: ఈ గౌరవం వారికే.. జాతీయ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ!

మీనాక్షి బీహార్ లో పేదల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపించారు. “పేదల ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. పేదలు ఓటు వేయకూడదా?” అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను మీనాక్షి అభినందించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు సామాజిక న్యాయానికి నిదర్శనమని ఆమె అన్నారు.
Suicide : KPHBలో విషాదం.. 17వ అంతస్తు నుండి దూకి అమ్మాయి ఆత్మహత్య

Exit mobile version