NTV Telugu Site icon

Organs Donated: చనిపోయిన కూడా పది మందికి జీవితాల్లో వెలుగులు నింపిన యువతి..

Organs Donated

Organs Donated

Organs Donated: ఈ శతకోటి జీవితాల్లో మనిషి పుట్టుక ఒక అద్భుతం. ఒక మనిషి అన్ని జీవులలో అత్యంత తెలివైనవాడు. ప్రతి ఒక్కరూ ఈ జన్మలో ఏదైనా గొప్పగా చేసి పదిమందికి గుర్తుండిపోయేలా చేయాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 200 అవయవాలను దానం చేసి పది మంది ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల చాలా మంది అవయవదానం గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి అవయవాలను దానం చేస్తారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న తమ కూతురు బ్రెయిన్ డెడ్‌తో హఠాత్తుగా మరణించడంతో.. తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది.

Read also: Godavari Floods: దారుణం.. భద్రాచలంలో రెండు రోజులుగా మృతదేహం..

మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక(16) నగరంలోని ఓ కళాశా లలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల22న ఇంటి నుంచి బయలుదేరే సమ యంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్చించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు. బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తేల్చారు. ఆ తల్లి దండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయ వాలు దానం చేసేందుకు నిర్ణయించారు. ఈనెల 25న బాలిక మృతి చెందడంతో బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు. ఇదే విషయం పై మేడ్చల్ పట్టణంలోని సోషల్ మీడియా వేదికగా బాలిక తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.
Jagga Reddy: వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా సీఎం అవుతా.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..