NTV Telugu Site icon

Eatala Rajendar: పెద్ద స్కెచ్ తోనే రంగంలోకి దిగారు.. ఈటల కీలక వ్యాఖ్యలు..

Etala Rajender

Etala Rajender

Eatala Rajendar: లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేస్తామని.. పెద్ద స్కెచ్ వేసుకొని రంగంలోకి దిగారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో నేను వచ్చే సమయం లేక రాకపోయినా.. నాకు సంపూర్ణ మద్దతిచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. టెక్నికల్ గా గెలిచింది ఈటల రాజేందర్ కావచ్చు.. కానీ గెలిచింది మల్కాజ్ గిరి ప్రజలు అన్నారు. ప్రలోభాలు, దావతులు, కుట్రలు, విష ప్రచారాలు ఎన్ని చేసిన నన్ను నమ్మి మీరందరూ ఓటు వేశారన్నారు. మిషన్ భగీరథ, కాలేశ్వరం లాంటివి అయిపోయాయి ఇక డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచన చేసి.. మూసి ప్రక్షాళనను తెరమీదకు తీసుకొచ్చారన్నారు. లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేస్తాము అంటున్నారు. పెద్ద స్కెచ్ వేసుకొని రంగంలోకి దిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Bandi Sanjay: బుల్డోజర్లు ముందు మా మీద.. ఆ తరువాత పేదల ఇళ్ల వద్దకు..

హైదరాబాదులో చెరువులు మురికి నిలయాలుగా ఉన్నాయన్నారు. చర్ల పక్కకు ఉండటం ఒక శాపం.. కానీ దిక్కు లేక ఉంటున్నారని ఆవేదన వ్యాక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి చక్కగా చేయలేదు, ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్గిరిని పట్టించుకోలేదు, ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, చెరువు లాంటి ఏంటో అవగాహన లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీ కోసం 13 వేల ఎకరాల భూములు సేకరించారు, రింగ్ రోడ్డు కోసం, ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తున్నారన్నారు. అలాగే చెరువులను కాపాడటానికి కూడా పట్టా భూములను సేకరించాలి. వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తున్న అన్నారు. అవేమీ లేకుండా కట్టుకున్న ఇళ్ళను కొలగొడతా అంటే న్యాయం అవుతుందా ? అని ప్రశ్నించారు. బిల్డర్లకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న అని కొంతమంది అంటున్నారని తెలిపారు. నా 25 ఏళ్ల రాజకీయ జీవితం కొట్లాటనే, అది పేదల కోసమే అన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి చివరికి కేసీఆర్ తో కూడా కొట్లాడానని తెలిపారు. ముఖ్యమంత్రిలతో పేదల కోసం కొట్లాడిన కమిట్మెంట్ ఉన్నవాడని అని తెలిపారు.

Read also: VC. Sajjanar: నేటితో మహాలక్ష్మి పథకానికి మూడు వందల రోజులు.. 90 కోట్ల మంది ప్రయాణం..

రేవంత్ రెడ్డిని గెలిపించింది ప్రజలకు బాగు చేస్తారని కానీ, ఏడిపిస్తాడని కాదు. ప్రజల కన్నీళ్లు చూసి నవ్వుతున్న రేవంత్ రెడ్డి ఒక సైకో.. శాడిస్ట్ మెంటాలిటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనది ప్రజలని ప్రేమించే మెంటాలిటీ కాదు.. దీనిమీద చర్చకు కూడా సిద్ధం అని సవాల్ విసిరారు. నేను తిరగని చెరువు లేదు, పలకరించని బాధితుడు లేడన్నారు. ఇంకా పిచ్చి పని ఈ ముఖ్యమంత్రి చేస్తాడని అనుకోవడం లేదన్నారు. జ్ఞానోదయమై సమీక్ష చేసి దీనికో పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప మీ తాత జాగీర్ లాగా వేధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. నిన్ను ముఖ్యమంత్రి ఎందుకు చేసామా అని నీకు మద్దతు ఇచ్చిన వారందరూ బాధపడుతున్నారని తెలిపారు. పట్టా భూముల్లో ఎవరైనా చెయ్యి పెడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నానని తెలిపారు. పర్మిషన్లు ఇచ్చిన నాటి ముఖ్యమంత్రిగా తప్పు చేశారని ముక్కు నేలకు రాశాక ఇల్లు కూలగొట్టు అని తెలిపారు. అనేకమంది సీఎంలను చూశాము నిన్ను కూడా చూస్తున్నాము. మంచి పనులు చేస్తే గుండెలో పెట్టుకుంటారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే బండకేసి కొడతారన్నారు. పీర్జాదిగూడలో మంచినీటి సమస్యలు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే విజయవాడ పరిస్థితే హైదరాబాద్ కు..