Terrible incident: అప్పుడే పుట్టిన ఆడ శిశువును కన్న తల్లి కనికరం లేకుండా కర్కశంగా చెట్ల పొదల్లో పడేసింది. శిశువు ఏడుపు విన్న ఓ ఆటో డ్రైవర్ పొదల మధ్య ఉన్న శిశువును చూసి స్థానికులకు తెలుపగా రక్తపు మడుగులో అల్లాడుతున్న శిశువును కాపాడి తిరిగి తల్లి ఒడిలోకి చేర్చారు. ఈ ఘటన గౌడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Mohammed Shami: తుది జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన మరోసారి రాకుండా చేశా: షమీ
ఛత్తీస్గఢ్ విజయ పూర్ కు చెందిన తులసి, సంతోష్ దంపతులు ఆరేళ్లుగా గౌడవెల్లి గ్రామ సమీపంలోని స్టార్ పౌల్ట్రీ ఫామ్ లో కూలీలుగా పనిచేస్తున్నారు. తులసి గర్భిణి కావడంతో భర్త సంతోష్ వైద్యపరీక్షల నిమిత్తం ఆమెను సోమవారం మేడ్చల్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువచ్చాడు. తిరిగి పౌల్ట్రీఫామ్ కు వెళ్తుండగా తులసికి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో మార్గమధ్యలోనే ఆడ శిశువును జన్మనిచ్చింది. ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో శిశువును ఓ కాగితంలో చుట్టి, రోడ్డుపక్కన ఉన్న ముళ్ల పొదల్లో వదిలేసి, అక్కడి నుంచి భర్తతో కలిసి పౌల్ట్రీఫామ్ కు వెళ్లిపోయింది. అయితే.. గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద అటు వైపు వెళుతున్న ఆటోడ్రైవర్ కు శిశువు ఏడుపు చప్పుడు వినబడింది. దీంతో ఆ వ్యక్తి స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు గ్రామ కార్యదర్శి మహిపాల్ రెడ్డికి విషయాన్ని తెలిపారు.
Read also: Deputy CM Bhatti Vikramarka: మున్నేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం
దీంతో కార్యదర్శి సిబ్బందితో ముళ్ల పొదల వద్దకు చేరుకుని గాలించగా.. పొదల మధ్య రక్తపు మడుగులో శిశువు రోదిస్తూ కనబడింది. స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశావర్కర్ లక్ష్మిని రప్పించి, శిశువును పొదల నుంచి బయటకి తీశారు. అప్పటికే శిశువుకు ముళ్లు గుచ్చుకు పోవడంతో పాటు చీమలు పట్టి గాయాలయ్యాయి. వెంటనే శిశువును ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం తల్లిదండ్రుల గూర్చి ఆరాతీయగా అక్కడే ఉన్న ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తులు శిశువును కనిపారేసిన వారి వివరాలు చెప్పడంతో కార్యదర్శి పౌల్ట్రీఫామ్ వద్దకు వెళ్లాడు. తులసి, ఆమె భర్తను నిలదీశారు. దీంతో వారు శిశువు తమదేనని ఒప్పుకోవడంతో తులసిని బిడ్డతో పాటు మేడ్చల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఆమె భర్త సంతోష్ నీ మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. కాగా తనకు పుట్టిన బిడ్డ చనిపోయిందనుకుని కాగితంలో చుట్టేసి పొదల్లో వదిలేశానని, అయితే శిశువు బతికుందని అధికారులు తెలపడంతో నేనే పెంచుకుంటానని తులసి తెలిపింది.
Minister Ponnam Prabhakar: హిమాయత్ సాగర్ జలాశయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్…