Site icon NTV Telugu

Medaram 2026: మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధుల మంజూరు

Medaram 2026

Medaram 2026

Medaram: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను మేడారం మహా జాతర ఏర్పాట్లతో పాటు శాశ్వత నిర్మాణాల పనులకు వినియోగించనున్నారు. జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.

Nellore Lady Don Arrest: రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు.. నెల్లూరు లేడీ డాన్‌ అరెస్ట్..

ఇక మునుపెన్నడూ లేని రీతిలో భారీగా నిధులు కేటాయించడంపై మంత్రి సీతక్క స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. మేడారం జాతర ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రభుత్వం చూపుతున్న కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరలో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే జాతరకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సారి మునుపటి కంటే మరింత విస్తృతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Neha Sharma : దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..

ఇదిలా ఉంటే.. ఇప్పటికే.. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర వైభవంగా జరగనుంది. ప్రకటన ప్రకారం, జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరగా, జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోగా, చివరి రోజు జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశం జరుగుతుంది. మూడో రోజైన జనవరి 30న సమ్మక్క, సారలమ్మ వనదేవతలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించే ప్రధాన సందర్భంగా జాతర ఉత్సవాలు సాగనున్నాయి.

Exit mobile version