Site icon NTV Telugu

Tragedy: మంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి..

Swimming

Swimming

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. కొల్చారం (మం) పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడుపాయల జాతరకు వచ్చిన నలుగురు యువకులు స్నానం కోసం నదిలోకి దిగారు. దీంతో.. ఇద్దర నీట మునిగిపోగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా హైదరాబాద్ ఇందిరా నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Read Also: Kavya Kalyani: ‘ఢీ’షో డ్యాన్సర్ కావ్య కల్యాణి ఆత్మహత్య

ఏడుపాయల జాతరకు వచ్చిన నలుగురు యువకులు.. తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా నదిలోకి స్నానానికి దిగారు. నదిలో మునిగి పోయిన వారిలో కృష్ణ (20), షామా (21) ఉన్నారు. ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు. మునిగిపోయిన వారిని పోలీసులు సహాయంతో బయటకు తీయించి.. మృతదేహాలను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: Shamshabad Air Port: ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఔట్ పోస్ట్..

Exit mobile version