NTV Telugu Site icon

BRS MLAs: పార్టీ మారే ఆలోచన లేదు.. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తప్పా..?

Brs Mlas

Brs Mlas

BRS: బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యే నిన్న ( మంగళవారం ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఇవాళ నలుగురు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇస్తున్నారు.. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం.. మాపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకే రేవంత్‌రెడ్డిని కలిశాం అని ఆమె తెలిపారు. అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశాం.. పార్టీ మారే ఆలోచన మాకు లేదు.. కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తామని సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.

Read Alo: Devara: ఏప్రిల్ 5 నుంచి ఇండిపెండెన్స్ డేకి వాయిదా?

పార్టీ మారుతారనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మా పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే న్యాయపరంగా ముందుకెళ్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తాం అని తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ సమస్యలు వస్తున్నాయి.. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లాం అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్, భద్రత సమస్యలు వస్తున్నయని ఇప్పటికే చెప్పాం.. దీనిపై అడిషనల్ డీజీ శివధర్ రెడ్డిని మేము నలుగురం కలిశామని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయడం లేదు.. వాటికి స్పష్టత లేదు.. పరిపాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు.

Read Alo: Health Tips : బ్రౌన్ బ్రెడ్ ను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

అలాగే, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తప్పా..? అని ప్రశ్నించారు.. మళ్ళీ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కలుస్తాం.. వంద సార్లు.. వందసార్లు కలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇతర సమస్యలు కోసం ప్రభుత్వంలో ఉన్న వారిని కలుస్తునే ఉంటాన్నారు. అనవసర ప్రచారం చేసి మమ్మల్ని బద్నాం చేయడం కరెక్ట్ కాదన్నారు. మేం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో చేరే అవసరం మాకు లేదు.. బీఆర్ఎస్ ఉన్నంత కాలం కేసీఆర్ ను విడిచి పెట్టే ప్రసక్తి లేదన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఎందుర్కొంటున్న ప్రోటోకాల్ సమస్యపై సీఎంకు తెలియజేశామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.