NTV Telugu Site icon

Edupayala Temple: గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద

Yedupayalu

Yedupayalu

Edupayala Temple: మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలో ఉంది. భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. వరద ఉధృతి పెరగడంతో ఆలయంలోకి నీరు చేరింది. దీంతో ఆలయం ముందు ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తుంది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద వెళుతుంది. ఆరు రోజులుగా రాజగోపురంలో అమ్మవారు ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్నారు. గత ఏడు రోజులుగా ఆలయం జలదిగ్బంధంలో ఉంది.

Read also: Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం..

ఈ సందర్భంగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద తగ్గిన తర్వాత అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నందున మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 28,181 క్యూసెక్కుల వరద వస్తుండగా, 15,114 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయి. సింగూరు పూర్తిస్థాయి నీటి సరఫరా 29.91 టీఎంసీలు. ఇప్పుడు 28.939 టీఎంసీలు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తుండటంతో.. సంగారెడ్డి 4.3, కంది 4.1, కొండాపూర్ 3.4, కంకోల్ లో 3.1 సెంటిమీటర్ల వాన నెమోదైంది.. ఇక మెదక్ జిల్లా చిలిప్ చెడ్ లో 2.4 సెంటిమీటర్ల వర్షం నమోదైంది.
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!

Show comments