NTV Telugu Site icon

Jishnu Dev Varma: వందేళ్ల వేడుకకు రావడం సంతోషంగా ఉంది.. మెదక్ చర్చిపై గవర్నర్ సందేశం..

Jishnu Dev Varma Governer

Jishnu Dev Varma Governer

Jishnu Dev Varma: మెదక్ చర్చి వందేళ్ల వేడుకకు రావడం సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చర్చి వందేళ్లు పూర్తి చేసుకోవడమే కాదు.. యేసు ప్రేమను కూడా వందేళ్లుగా పంచుతుందని అన్నారు. యేసు మనల్ని ఎలా అయితే ప్రేమిస్తాడో… మనం అలా ఇతరులను ప్రేమించాలని తెలిపారు. మెదక్‌ చర్చి సందర్శన అనంతరం అక్కడి నుంచి కొల్చారం గురుకులంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. గవర్నర్ కి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి స్వాగతం పలికారు. విద్యార్థులతో గవర్నర్‌ కాసేపు ముచ్చటించారు. గురుకులంలో ఆహారం, వసతి ఎలా ఉందని గవర్నర్ ఆరా తీశారు. డైట్ చార్జీల పెంపు, కొత్త తర్వాత ఫుడ్ బాగుందని విద్యార్థులు చెప్పడంతో గవర్నర్‌ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇబ్బంది కలిగించ వద్దని అధికారులను సూచించారు. విద్యార్థుల పట్ల అంకిత భావంతో ఉండాలని ఇబ్బందికి గురి చేయెద్దని తెలిపారు.

Read also: S Jaishankar: దేశ ప్రయోజనాలకు ఏది కరెక్టో అదే చేస్తాం..

శతాబ్ది ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 23వ తేదీ సోమవారం నాడు చర్చి ఆవరణలో ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించనున్నారు. చర్చి వ్యవస్థాపకుడు రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్‌నెట్ యొక్క మూడవ తరం కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. డయాసిస్ ఇన్‌చార్జి బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ రూబెన్ మార్క్ పాల్గొని భక్తులకు దివ్య సందేశం అందిస్తారు. 15 మంది బిషప్‌లు, గురువులు, గురువేతరులు, వివిధ సంఘాల నాయకులు హాజరుకానున్నరు. ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే నాటక ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్థనలు, భక్తబృందంచే గానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మెదక్ ప్రెసిబిటరీ ఇన్‌ఛార్జి శాంతయ్య బుర్రకథ, చర్చి వ్యవస్థాపకుడు చార్లెస్ వాకర్ పాస్నేట్‌ గురించి ప్రదర్శనను నిర్వహించారు.
Smartphones Launch 2025: వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

Show comments