Medak Tour: నేడు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. ఇవాళ వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో కొల్చారం సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. సీఎం రేవంత్ తో పాటు హెలికాప్టర్ లో మెదక్ కి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ రానున్నారు.
Read also: Astrology: డిసెంబర్ 25, బుధవారం దినఫలాలు
అక్కడి నుంచి వాహనంలో ఏడు పాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మెదక్ క్యాథెడ్రిల్ చర్చిలో వందేళ్ల వేడుకలో పాల్గొని క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఒంటిగంటకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ పయనం కానున్నారు.
Read also: Kannappa : కనప్పపై ఆసక్తి పెంచుతున్న యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియో
ఉప రాష్ట్రపతి, గవర్నర్ మెదక్ జిల్లా పర్యటన షెడ్యూల్..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో తునికి కృషి విజ్ఞాన కేంద్రానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకోనున్నారు. ఉప రాష్ట్రపతికి మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ స్వాగతం పలకనున్నారు. సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులు, ఆసక్తి ఉన్న మరో 300 మందితో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు. సేంద్రియ పంటలు పండిస్తున్న విధానాన్ని పరిశీలించి ఎగ్జిబిషన్ తిలకించనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు మెదక్ పర్యటన ముగించుకొని ఉపరాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు.
Read also: Ghaati : అనుష్క ‘ఘాటీ’లో మరో సర్ ప్రైజింగ్ స్టార్
నేడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా.. పోలీసులు భారీ బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు అధికారులు. చర్చ్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చర్చ్ వద్దకు వాహనాలను అనుమతిని నిరాకరించారు.
IND W vs WI W: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం