Site icon NTV Telugu

Medak Tour: రేపు మెదక్ జిల్లాలో ప్రముఖుల పర్యటన.. షెడ్యూల్ ఇదే

Medak Tour

Medak Tour

మెదక్ జిల్లాలో రేపు (బుధవారం) పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. రేపు వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో.. భారీ బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు అధికారులు. తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రీయ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి, గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

Read Also: Tirupati: అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ.. హిందూ సంఘాల నిరసన

ఇప్పటికే హెలికాప్టర్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. అలాగే.. ఉపరాష్ట్రపతి పాల్గొనే సభా ప్రాంగణాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అందుకోసం.. ఏడు పాయల ఆలయం వద్ద సీఎం రాక కోసం హెలిప్యాడ్ సిద్ధం చేశారు అధికారులు. రేపు ఏడు పాయల అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత.. మెదక్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read Also: Surat: సూరత్‌లో పట్టాలు తప్పిన సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్.. కొనసాగుతున్న సహాయ చర్యలు

Exit mobile version