NTV Telugu Site icon

Meat Shops Closed: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు చికెన్‌, మటన్‌ షాపులు బంద్‌..!

Motten Chin Shops Closed

Motten Chin Shops Closed

Meat Shops Closed: ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగనే చెప్పాలి. రోజూ నాన్ వెజ్ తిన్నా కూడా ఇక ఆదివారం వచ్చిందంటే మటన్, చికెన్ ఉండాల్సిందే. ఆదివారం రోజు ముక్క నోట్లో వెళ్లందే సండే అన్న ఫీలింగ్ రాదు. అలాంటిది ఆదివారం రోజు నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు అధికారులు. ఇవాళ చికెన్, మటన్ షాపులు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read also: Nirmal: నర్సాపూర్ కేజీబీవీ విద్యార్థుల అస్వస్థత ఘటన.. భాద్యులపై వేటు

ఇవాళ హైదరాబాద్ ప్రజలకు మాంసం దొరకదని, నేడు నగరంలోని మటన్ దుకాణాలతో పాటు చికెన్, బీఫ్ మార్కెట్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జైనులు మహావీర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

Read also:KKR vs RCB: దూకుడుమీదున్న కేకేఆర్ ను ఆర్సీబీ తట్టుకోగలదా..

జైనులు జరుపుకునే పండుగలలో, మహావీరుడు అత్యంత ముఖమైనవాడు. ఈ నేపథ్యంలోనే మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశాలు జారీ చేశారు. కాదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నాన్ వెజ్ షాపులను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వుల అమలులో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం యథావిధిగా మటన్, చికెన్, షాపులు తెరవవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రజలు సహకరిపంచాలని కోరారు. మాంసం షాపుల యజమానులు దీనిని గమనించి షాపులను బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వేళ కాదని తెరిచిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Jake Fraser-McGurk: ఓకే ఓవర్‌లో 4,4,6,4,6,6.. మెక్‌గర్క్ విధ్వంసం వీడియో వైరల్‌!