NTV Telugu Site icon

C.V.Anand: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠా.. ముంబైలో మకాం వేసి..

Ci

Ci

Drugs Mafia: ముంబై నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రాకుండా కట్టటి చేస్తున్నామని, టీ ల్యాబ్ అందుబాటులోకి తెస్తున్నాం, దాని ద్వారా మరింత నిఘా పెడుతామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ను రూపుమాపడానికి చాలా వ్యూహాలతో నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ముందుకు పోతుంది. డ్రగ్స్ పెడ్లర్లు తోపాటు డ్రగ్స్ సేవించే వారిలో భయాన్ని తీసుకొచ్చామన్నారు. ముంబై కేంద్రంగా ఇప్పుడు డ్రగ్స్ అడ్డాగా మారిందని డ్రగ్స్ వ్యవహారంలో గోవా పోలీస్ గతంలో మాకు సహకారం అందించాలేదన్నారు. ఇప్పుడు ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాలపై మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. వారి సహకారంతో ముంబై లో కూడా ఆపరేషన్లు చేస్తామని, కొద్దీ రోజుల్లోనే T ల్యాబ్ అందుబాటులోకి తెస్తున్నాం, దాని ద్వారా మరింత నిఘా పెడుతామన్నారు. ముంబై కేంద్రంగా అమ్మబడుతున్న నార్కోటిక్ డ్రగ్ MDMA గా గుర్తించామని తెలిపారు. సనా ఖాన్ అనే ఒక స్టూడెంట్ ఓ ఐటీ కంపనీలో పని చేస్తుందని, ముంబై వెళ్లి అక్కడ డ్రగ్స్ సేవిస్తుంది, ఒక గ్రాము మూడు వేలకు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కి సనా ఖాన్ డ్రగ్స్ తెచ్చి ఒక గ్రాము 7 వేలకు అమ్మకాలు చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ కి చెందిన 40 మంది, ముంబైలో 70 మంది స్నేహితులకు అమ్మకాలు చేస్తుందని తెలిపారు.

Read also: Komatireddy Venkat Reddy: పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందే..!

ముంబైలో ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ ను త్వరలో పట్టుకుంటామన్నారు. కిలో MDMA కు ఆరు లక్షలు అమ్మకాలు చేస్తిన్నట్లు గుర్తించామని తెలిపారు. ముంబైలోని మలాద్ ప్రాంతం నుండి శంషఉద్దీన్ ద్వారా ట్రాన్స్ఫర్ట్ చేస్తున్నారని తెలిపారు. జతిన్ భాలచంద్ర భలేరావుకి పంపుతున్నారని తెలిపారు. ఏడాదికి 12 లక్షలు విలువైన డ్రగ్స్ అమ్మకాలు చేసినట్లు గుర్తించామమని సీపీ తెలిపారు. ముంబైలో నయా ట్రెండ్ నడుస్తుందని, అమ్మాయిలకు డ్రగ్స్ ఇవ్వడం, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారిపై లైంగిక దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల నుండి 204 గ్రాముల MDMA, ఫోర్ వీలర్ ను సీజ్ చేశామని తెలిపారు. ముంబైలో మరో గ్యాంగ్ ను అరెస్ట్ చేశామని, ఏపీ నుండి ముంబైకి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ కేసులో భార్య భర్తల ఇద్దరు పరారు అయ్యారని, వారికోసం గాలిస్తున్నామన్నారు. వారి వద్ద 110 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశామమన్నారు. ఇక మూడో గ్యాంగ్ ను కూడా పట్టుకున్నామని, మెహర్జ కాజి అనే వ్యక్తి కూడా డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. నాలుగు లక్షల విలువైన 40 గ్రాముల MDMA సీజ్ చేశామమన్నారు. మొత్తం ముంబై కేంద్రంగా నడుస్తున్న మూడు గ్యాంగ్ లను అరెస్ట్ చేశామన్నారు. గతంలో అరెస్ట్ చేసిన టోనీ ఆధారంగా ఈ కేసు పెట్టుకున్నామన్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రాకుండా కట్టటి చేస్తున్నామన్నారు. ముంబై పోలీసుల సహకారంతో నలుగురిని తీసుకున్నామన్నారు.
Haath se haath Jodo: రేవంత్‌ తో వీహెచ్‌ పాదయాత్ర.. సాయంత్రం భట్టితో..