MBBS Student suicide: నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుంది. విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమ ఆత్మవిశ్వాన్ని కోల్పోయి ఇలా ఆత్మహత్యలకు పాల్పడి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి మంచి భవిష్యత్తుకై ఎదగాల్సిన విద్యార్తులు ఇలా ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. చదువుకుని ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తారనే తల్లిదండ్రులు ఆశలను అడిఆశలు చేస్తూ వారికి పుట్టెడుదుఖాన్ని మిగిలిస్తున్నారు. అలాంటి మరో ఘటన నిజామాబాద్ మెడికల్ కళాశాలలో చోటుచేసుకోవడంతో విద్యార్థులకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎం.బి.బి.ఎస్. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ మెడికల్ కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ పెద్ద పల్లి జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. MBBS మూడవ సంవ్సతరం పరీక్షలు రాసిన సనత్.. ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతుంగా సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులకు మెడికల్ కాలేజీ అధికారులు సమాచారం ఇచ్చారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థులు తేరుకోకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళన గురిచేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష నిజామాబాద్‌లో మెడిసిన్ చదువుతున్నాడు. ఈ ఉదయం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి మెడిసిన్ చదువుతున్న హర్ష మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పరీక్ష రాయాల్సిన హర్ష పరీక్షలకు హాజరు కాకుండా హాస్టల్‌లోనే ఉన్నాడు. పరీక్షల్లో ఎందుకు ఉత్తీర్ణత సాధించకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు హాస్టల్‌కు వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Icc World Cup 2023 : భారత్ లో ఆడే ప్రసక్తి లేదు.. లంకలో అయితే ఓకే!