అతనో ఎంబీఏ పట్టభద్రుడు. ఉన్నత విద్యను అభ్యసించడమే కాదు గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ తన వ్యసనాలను మానలేకపోయాడు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేశ్ అలియాస్ సామ్ రిచర్డ్ నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా వృత్తిని ఎంచుకుని.. ఇళ్లలో చోరీలు చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. 200 వరకు దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోలేదు. తాజాగా మరో కేసులో హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీసులకు చిక్కాడు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 19 తులాల బంగారు నగలు, రూ.3 లక్షల నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
వంశీకృష్ణ 2004లో ఎంబీఏలో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకోసం సులభంగా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనాలే మార్గమని నిర్ణయించుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు మొదలుపెట్టాడు. హైదరాబాద్ నగరంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2006 నుంచి ఇప్పటివరకు 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడని పోలీసులు తెలిపారు. వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు.
Chandrashekhar Guruji: శిష్యుడే గురూజీ హంతకుడు..? నిందితుడి భార్య గతంలో..
సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత కొన్నాళ్లుగా ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఈ విధంగా 38 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. వలవేసి ఓ కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 800 గ్రాముల బంగారం, లక్షా యాభైవేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విచారణలో నిందితుడి గురించి తెలుసుకుని పోలీసులే నోళ్లు వెళ్లబెట్టారు. నిందితుడు హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. పైగా గోల్డ్‌మెడల్ కూడా సాధించాడు. మరి ఉద్యోగం వదిలేసి దొంగతనాలను ఎంచుకున్నాడెందుకో అని తలలు పట్టుకున్నారు.
