NTV Telugu Site icon

Theft: పెండ్లి ఇంట్లో భారీ చోరీ.. 11 లక్షలతో ఉడాయించిన దొంగలు

Thife

Thife

Theft: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని ఓ పెండ్లి ఇంట్లో భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. రూ. 11 లక్షల సొత్తుతో దొంగలు ఉడాయించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ ఫేజ్ 1-16బి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి తలుపులు పగలగొట్టి రూ. 3,72,000 విలువైన 6 తలా బంగారు గొలుసులు, ఉంగరాలు, రూ. 3 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, రూ. 3,75,000 విలువైన 5 కిలోల వెండి వస్తువులు, రూ. 10 వేల నగదు అపహరించారు. బుల్లెట్ వాహనాన్ని కూడా దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చెల్లి పెళ్లి వేడుక ముగించుకుని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చేసరికి వెనుక తలుపు పగులగొట్టి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌ కి గురయ్యారు. ఇంట్లో అంతా చిందరవందరగా ఉండటంతో ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read also: Hairy Tongue : మహిళకు అక్కడ కూడా వెంట్రుకలు… భయం లేదంటున్న డాక్టర్లు

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంత పకడ్బందీగా దొంగలు ఇంట్లోకి వచ్చి సొత్తును దొంగాలించారంటే కుటుంబ సభ్యులకు తెలిసిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఇంత సొత్తు ఉంటుందని ముందే వారికి ఎవరైనా చేదీశారా? లేక ఇంట్లో వున్న వాల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పకడ్బందీగా ఈ చోరీ ప్లాన్‌ చేశారంటే దొంగలు ఈ ఇంటిపై ఎప్పటినుంచే కన్ను వేసి వున్నారని గ్రహించారు. ఇంట్లో ఇంత సొత్తు ఉంటుందని ముందే వీరి గ్రహించారు కాబట్టి ఇంట్లో ఎవరు లేని సమయంలో సునాయాసంగా వెనుక తలుపులు పగుల గొట్టి చోరీ చేశారని పోలీసులు భావిస్తు్న్నారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ కాబట్టి అందరూ అలర్ట్‌ గా ఉండాలని కోరారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ఇంట్లో ఎలాంటి డబ్బులు, బంగారం వంటి వస్తువులు పెట్టి వెళ్లకూడదని సూచించారు. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని కోరారు.
Hawala money: రెజిమెంటల్ బజార్ అగ్ని ప్రమాద ఘటనలో ట్విస్ట్.. బయటపడిన హవాలా సొమ్ము