Karimnagar Cylinder Blast: అగ్నిప్రమాదాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. రసాయనాల పేలుడు, షార్ట్ సర్య్కూట్ వంటి వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక ఈ ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇటీవలే కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో సారి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన కలకలం రేపుంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Read also: Bihar : లక్షల్లో గిప్ట్ ఇచ్చిన లవర్ బాయ్.. చేతికి చిక్కగానే చెక్కేసిన ప్రియురాలు
ఇంతకీ ఏం జరిగింది..
కరీంనగర్ లో ఉంటున్న ఓ కుటుంబం మేడారం జాతరకు పయనమయ్యారు. అయితే ఇంట్లో దేవుడి వద్ద దీపం పెట్టి వెళదామని అనుకున్నారు. మేడారం వెళుతూ ఇంట్లో పూజలు చేసి దేవుడికి దీపం పెట్టారు. ఇంట్లో తాళం వేసి వెళ్లింది. అయితే ఇవాళ మధ్నాహ్నం మేడారం వెళ్లి ఆ కుటుంబ ఇంటిలో నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. మొదట అక్కడి స్థానికులు లైట్ తీసుకున్నారు. అయితే అవి రాను రాను ఎక్కవగా రావడంతో ఇంట్లో ఏదో వస్తువుకు అగ్ని అంటుకుని ఉంటుందని ఇంటి యజమానికి కాల్ చేశారు. అయితే ఇంటిని మొత్తం.. పొగలు వ్యాపించడంతో బయట జనాలు భయాందోళన చెందారు. మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయితే.. కాసేపు అక్కడ స్థానికులందరు వచ్చి గుంపుగా ఈ ఘటనను చూస్తున్నారు. ఇంతలోనే బాంబు పేలిన శబద్దం. అంతే అక్కడి నుంచి హా.. హా కారాలతో ప్రజలు పరుగులు పెట్టారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Medaram Jathara: మేడారంలో గవర్నర్.. వనదేవతలను దర్శించుకున్న తమిళిసై